BRSపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఫైర్!

బీఆర్ఎస్ పాలనపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఫైర్ అయ్యారు.

Update: 2023-11-21 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పాలనపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఫైర్ అయ్యారు. నాలుగు ఐదు రోజుల నుంచి హైదరాబాద్‌లో తిరుగుతున్నామని పదేళ్ల పరిపాలనలో అనేక సమస్యల ఇక్కడ ఉన్నాయన్నారు. కానీ బీ‌ఆర్‌ఎస్ సర్కార్ కాంగ్రెస్, కర్ణాటక ప్రభుత్వాన్ని అదే పనిగా బద్నాం చేస్తోందని మండి పడ్డారు. సొంత రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక కర్ణాటకపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి బీఆర్ఎస్ భయపడుతుందన్నారు. తాము ప్రకటించిన హామీలను చేసి చూయిస్తామన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను 6 నెలల్లోనే అమలు చేశామన్నారు.

బీఆర్‌ఎస్ మేనిఫెస్టో చూస్తే ఎన్ని పథకాలు అమలు అయ్యాయో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలకు తమ పాలన గురించి ఏం తెలుసన్నారు. వాళ్లు లబ్ధి దారులు కాదు కదా..? అన్నారు. గృహలక్ష్మి పథకాన్ని కోటి 60లక్షల మందికి అమలు చేశామన్నారు. అన్న భాగ్య పథకాన్ని 3.92 కోట్ల మందికి అందించామన్నారు. కేసీఆర్, మోడీ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా మెలుగుతున్నారన్నారు. కర్ణాటకలో ప్రతి రోజు 60 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారన్నారు.

వాళ్లంతా ప్రభుత్వం బాగుండాలని గుడులలో పూజలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో 3600 మంది యువత సూసైడ్ చేసుకున్నారన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక యువత  బెంగళూరు వచ్చి జాబ్ చేస్తున్నారన్నారు. కర్ణాటకలోని ప్రజలు అక్కడ స్కీములతో 80 నుంచి లక్ష వరకు సేవింగ్స్ చేసుకుంటున్నారన్నారు. కానీ బీఆర్ఎస్ ఫామ్ హౌస్‌లో డబ్బులను నింపుతున్నదన్నారు. ప్రజల సంపదని దోచుకుంటున్నారన్నారు.

కర్ణాటకలో అన్ని స్కీములు అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయన్నారు. అనుమానం ఉంటే గాంధీభవన్‌లో బస్సు పెడతాను వచ్చి పరిశీలించవచ్చన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టు రాష్ట్రీయ సమితి అన్నారు. పదేళ్ళ పాలనలో 10 స్కీంలలో రూ.10 లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. మిస్టర్ కేసీఆర్ ముందు తెలంగాణ ప్రజల చింతను తీర్చు.. కర్ణాటక ప్రజల కోసం కాంగ్రెస్ సమర్ధంగా పనిచేస్తోందన్నారు.

Tags:    

Similar News