మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై కర్నాటక సీఎం సీరియస్

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై వరుసగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఎక్స్ (ట్వీట్) పై కర్నాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-12-19 07:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై వరుసగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఎక్స్ (ట్వీట్) పై కర్నాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అంటూ కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెబుతున్నట్లు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియోను తాజాగా కేటీఆర్ ట్విట్టర్ లో రీ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు. అలా హామీలు ఇచ్చేముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందా అనే కేటీఆర్ ప్రశ్నించారు.

కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై సిద్ధరామయ్య స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ కేటీఆర్ తెలంగాణలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏని సత్యం ఏది ఫేక్ అనేది ధృవీకరించాలో కూడా తెలియదు. బీజేపీ ఎడిట్ చేసిన నకిలీ వీడియోలను మీరు సర్క్యూలేట్ చేస్తున్నారు. అందుకే మీరు బీజేపీ పర్ఫెక్ట్ బీ టీమ్ అంటూ దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఫాక్స్ కాన్ చైర్మన్‌కు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారంటూ ఓ ఫేక్ లెటర్ ను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అదే కర్నాటక సీఎంకు సంబంధించిన వీడియోను రీపోస్ట్ చేయగా ఐటీశాఖ మాజీ మంత్రి రాజకీయాల కోసం ఇంతలా ఎలా ఫేక్ న్యూస్ లను సర్క్యూలేట్ చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

కాగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని సిద్ధరామయ్య ఇది వరకే ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి రవి తనపై దుష్ప్రచారం చేస్తున్నారాని నా వ్యాఖ్యలను వక్రీకరించి ఎడిట్ చేసి వాటిని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. 2018లో హామీలు అమలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప సైతం అంగీకరించగా ఆ మాటలను తారుమారు చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News