సింగరేణిలో కలకలం.. పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

దిశ, గోదావరిఖని: సింగరేణి వర్క్ షాపులో ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచే

Update: 2022-03-25 03:04 GMT

దిశ, గోదావరిఖని: సింగరేణి వర్క్ షాపులో ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గత నెల రోజుల క్రితం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు స్వామిదాస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అధికారుల ముందే చెప్పుతో సదరు నాయకుడికి దేహశుద్ధి చేసిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడం సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. విచారణ జరుగుతుండగానే తనపై దాడి చేసి కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడని సదరు మహిళ ఏకంగా వర్క్ షాప్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు, అధికారులు అడ్డుకున్నారు. సదరు మహిళకు తోడుగా తోటి కార్మికులు గేటు ముందు కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు. కేసు వాపసు తీసుకోవాలని, లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారని మహిళ ఆరోపిస్తోంది. రాత్రి తన అనుచరులతో కలిసి తనపై కాకుండా తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని సదరు మహిళ కన్నీటి పర్యంతమైంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పేరుతో  స్వామిదాస్ అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. దీంతో స్వామిదాస్ కు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు

Tags:    

Similar News