Municipal Chairman : స్టీల్ వస్తువుల వాడకాన్ని ప్రచారం చేయాలి..

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో మహిళల పాత్ర కీలకమని, అందులో భాగంగానే స్టీల్ వస్తువుల వాడకాన్ని ముమ్మరంగా ప్రచారం చేయాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ అయాజ్ లు అన్నారు.

Update: 2024-07-26 10:37 GMT

దిశ, జమ్మికుంట : ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో మహిళల పాత్ర కీలకమని, అందులో భాగంగానే స్టీల్ వస్తువుల వాడకాన్ని ముమ్మరంగా ప్రచారం చేయాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ అయాజ్ లు అన్నారు. శుక్రవారం పాత మున్సిపల్ కార్యాలయంలో జీవనజ్యోతి పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయగా చైర్మన్, కమిషనర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే విధంగా అవగాహన కల్పించాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, ఎడీఎంసీ మల్లేశ్వరి, టీఎల్ఎఫ్ అధ్యక్షరాలు రాణి, కోశాధికారి గీత, కార్యదర్శి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News