'Telanganaప్రభుత్వ పథకాలే బాగున్నాయి.. మమ్ముల్ని మీ రాష్ట్రంలో కలపండి'
మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని దెగ్లుర్ తాలూకాలోని మానూరు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులతో
దిశ, జుక్కల్ : మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని దెగ్లుర్ తాలూకాలోని మానూరు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి నాందేడ్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామని గ్రామస్తులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానూర్ గ్రామం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, రహదారులు, ఎడ్యుకేషన్ విద్యార్థుల కోసం బాగున్నాయని, మమ్ముల్ని తెలంగాణలో కలపాలి, మాకు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని దెగ్లుర్ తాలూకాలో మానూరు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read....