రాబోయే పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం
రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ అన్నారు.
దిశ, వెల్గటూర్ : రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ అన్నారు. పవిత్ర కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది వద్ద ఆదివారం నిర్వహించిన మహ హారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేద పండితులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి హారతిని ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వం నుండి వచ్చిన తాంబూలాలను మహిళలకు పంపిణీ చేసి మాట్లాడారు.
పవిత్ర కార్తీక మాసం చివరి రోజున ధర్మపురి పుణ్య క్షేత్రంలో నిర్వహించే మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, గత నెల రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి గోదావరి నదీమ తల్లికి హారతి కార్యక్రమన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలపై గోదావరి నదీమతల్లి ఆశీస్సులు , ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షాలు రాష్ట్ర ప్రజానీకం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. రానున్న పుష్కరాలను కూడా వేద పండితుల, అర్చకుల సూచనల మేరకు ప్రణాళికాబద్దంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తా మన్నారు. చివరి రోజున గోదావరి మహా హారతి కన్నుల పండువగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.