కొలమద్ది ప్రాథమిక పాఠశాలలో టీచర్ల కొరత తీరేది ఎప్పుడు..?

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో ఉన్న

Update: 2024-12-02 09:54 GMT

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మొత్తం 92 మంది విద్యార్థులు ఉండగా, కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అందులో పాఠశాల నిర్వహణ కోసం ప్రధాన ఉపాధ్యాయుడు , మిగిలిన ఒక టీచర్ పిల్లలను చూడటం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా పిల్లల తల్లిదండ్రులు మరో ఇద్దరు ప్రైవేటు టీచర్లను పెట్టి ప్రభుత్వ స్కూల్ లో ఫీజులు కడుతున్నారు.

గత నెలలో ఒక టీచర్ పోస్ట్ మంజూరు చేసిన ఆ టీచర్ ఇంతవరకు రావడం లేదు.దీనిపై డీఈఓ కు 15 సార్లు పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. చివరిగా పిల్లలే జిల్లా పాలనాధికారి కి సోమవారం రోజున ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారం లోగా సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ప్రజావాణి కి పిల్లలు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వెళ్లి మరోసారి జిల్లా కలెక్టర్ కి నివేదించడం జరుగుతుంది అని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.


Similar News