సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యం : ఎస్పీ అఖిల్ మహాజన్
సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు.