రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పగించారు : ప్రభుత్వ విప్ అడ్లూరి
మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల
దిశ,వెల్గటూర్ : మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అప్పుల కుప్పగా మార్చి తమకు అప్పగించిన ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 4న పెద్దపల్లి లో చేపట్టబోతున్న సీ ఎం భారీ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు నిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగులకు ముఖ్యమంత్రి 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం , అలాగే రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసిందని విమర్శించారు. రైతులు పండించిన పంటను మిల్లర్లు బహిరంగంగా దోచుకుంటున్న ఆనాడు ఎవరు అడ్డుకోలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని సంతోషంగా విక్రయిస్తుండగా సన్నాలకు బోనస్ కూడా పొందుతున్నారని తెలిపారు.మిల్లర్ల దోపిడీ నుంచి తట్టుకోలేక రైతు వచ్చి ఎమ్మెల్యే క్యాంపు క్యాంపు కార్యాలయంలో ధాన్యాన్ని పోసి నిరసన వ్యక్తం చేసిన విషయం ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన గుర్తు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ మిలర్లతో కుమ్మక్కయి రైతులను నిండా ముంచారని విమర్శించారు.ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దోచుకుని కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తమ చేతిలో పెట్టిందని మండిపడ్డారు.
సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహించిప్పటికి కొప్పుల ఈశ్వర్ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే,ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నీ మన నియోజకవర్గానికి మంజూరు చేయించి,దాని నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగిందని స్పష్టం చేశారు.ఇథనాల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన స్థలంలో 50 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వానికి విన్నవించాము, త్వరలో దానిని సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాల గ్రాంటుల నుంచి నిధుల విడుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటో ఐదేళ్లలో చేసి చూపిస్తామని విప్పు లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.