మంథనిలో చెరువులు కబ్జా.. ఇక్కడ హైడ్రా కావాల్సిందే..

Update: 2024-08-28 15:20 GMT

దిశ, మంథని : మంథనిలో కూడా హైడ్రా చట్టం అవసరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంథని మండలంలోని కొన్ని చోట్ల చెరువు శిఖం భూమి, కుంటలు, వాగులు, మత్తళ్లు అక్రమణకు, కబ్జాకు గురైనట్లు టాక్ వినిపిస్తుంది. చెరువులు, కుంటలు, వాగులపై ఆధారంగా ఎన్నో ఏళ్లుగా పంట పొలాలకు జీవరాశులు, ప్రాణ జీవులు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇది ప్రభుత్వ సంపదతో పాటు ప్రకృతి సంపద కూడా. వీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంది. దీనిని కాపాడి భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ సంపదను అందించాల్సిన బాధ్యత కూడా అందరిదీ.వీటి వల్ల జీవ ప్రాణకోటి మనుగడకు ఎంతో ముఖ్యం. లేదంటే దోపిడీకి అక్రమణకు గురైనట్లయితే పంట పొలాలకు, జీవ జీవ రాసుల బ్రతుకులు, ప్రకృతి కూడా భవిష్యత్తులో ప్రశ్నర్థకంగా మారె అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం హైదరాబాద్ లో హైడ్రా చట్టం తీసుకవచ్చి చెరువు సరిహద్దులో అక్రమ నిర్మాణలను తొలగిస్తున్నారు. పలు చోట్ల కూడా చెరువు శిఖం,ప్రభుత్వనికి చెందిన భూములు అక్రమనకు గురయ్యాయని వాటిని కాపాడడానికి హైడ్రా లాంటి చట్టం అవసరమని ఎమ్మెల్యే లు,పలువురు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. మంథనిలో కూడా హైడ్రా చట్టం అవసరమని అక్రమణకు గురైన చెరువు శిఖం,వాగులు కుంటలు, ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.


Similar News