dead body : స్వగ్రామానికి చేరిన వలస జీవి మృతదేహం

ఉన్న ఉళ్లో ఉపాధి లేక, బిడ్డ పెండ్లికి చేసిన అప్పులు తీరుద్దామని ఆశతో గల్ఫ్ దేశం వెళ్లిన వలస జీవి శవపేటికలో శవమై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Update: 2024-08-03 16:25 GMT

దిశ,గంభీరావుపేట : ఉన్న ఉళ్లో ఉపాధి లేక, బిడ్డ పెండ్లికి చేసిన అప్పులు తీరుద్దామని ఆశతో గల్ఫ్ దేశం వెళ్లిన వలస జీవి శవపేటికలో శవమై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గెరిగంటి అంజయ్య బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు తీర్చడానికి ఆరేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. తాను పనిచేస్తున్న కంపెనీలో సరిగ్గా జీతం ఇవ్వకపోవడం కొద్ది రోజులకే కంపెనీ మూసివేయడంతో రోడ్డున పడ్డాడు. ఎక్కడా పని దొరకకపోవడం, చేసిన అప్పులను ఎలా తీర్చాలని మానసిక ఆందోళనకు గురై

     అనారోగ్యం పాలై ఫుట్ పాత్ పై మరణించాడు. పాస్ పోర్టు కంపెనీ యాజమాన్యం వద్ద ఉండిపోవడంతో డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఇండియన్ ఎంబన్సీ లెటర్ పంపించగా, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి గుండాల్లి నర్సింలు, ఎన్నారై యసరవేణి ఆంజనేయులు చొరవతో డెడ్ బాడీ శనివారం ఇంటికి చేరింది. ప్రభుత్వం గెరిగంటి అంజయ్య కుటుంబం నిరుపేద కుటుంబం అని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 

Tags:    

Similar News