తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్
తొమ్మిదేళ్ల మోదీ సారథ్యంలోని బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు.
దిశ, కోరుట్ల : తొమ్మిదేళ్ల మోదీ సారథ్యంలోని బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శివసాయి గార్డెన్ లో సోమవారం మహాబిన్ సంపర్క్ అభియాన్ సోషల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో దేశం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండేదన్నారు.
అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా లేదని, అదే తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశం విశేషంగా అభివృద్ధి చెందిందన్నారు. డిజిటల్ ఇండియా రంగంలో భారతదేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. ముస్లిం, క్రైస్తవ మైనార్టీలను బీజేపీ ఏ రోజు కూడా ఓటు బ్యాంక్ లాగా చూడలేదన్నారు. వారి సంక్షేమం కోసం బీజేపీ పాటు పడుతోంన్నారు. బీజేపీని మతతత్వ పార్టీ అంటే వారిని దవడపై కొట్టాలని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
దేశంలో 56 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రగామిలో దేశాన్ని నిలపారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల బాగోగులు మర్చిపోయిందంటూ ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. రానున్న ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెండాల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ, నాయకులు సాంబారి ప్రభాకర్, సురభి నవీన్ కుమార్, జేఎన్ సునీతా వెంకట్, పుదరి అరుణ, దాసరి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.