ఢిల్లీ డెసిషన్ వల్లనే ప్రత్యేక తెలంగాణ : కేకే మహేందర్ రెడ్డి
గల్లీ లీడర్లు కావాలా, ఢిల్లీకి గులాం గిరి చేసే లీడర్లు కావాలా అని మాట్లాడిన కేటీఆర్ ఆ ఢిల్లీ డెసిషన్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, సిరిసిల్ల : గల్లీ లీడర్లు కావాలా, ఢిల్లీకి గులాం గిరి చేసే లీడర్లు కావాలా అని మాట్లాడిన కేటీఆర్ ఆ ఢిల్లీ డెసిషన్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, అక్రమాల నుండి బయట పడడానికి ఢిల్లీలో ఎవరికి గులాం గిరి చేస్తున్నరో ప్రజలందరికీ తెలుసని, సిరిసిల్లకు గొప్పగొప్ప కాలేజీలను తెచ్చిన అని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇప్పటికి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. హంగుహర్బటాల కోసం టెట్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని, కృతజ్ఞత సభ కోసం ఎర్రటి ఎండలో విద్యార్థులను, మహిళలను నిల్చోబెట్టడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని పైర్ అయ్యారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే సంచలన వాఖ్యలు చేశారు. కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల సస్యశ్యామలం అయితే కాంగ్రెస్ నేతల కండ్లు మండుతున్నయని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.
సిరిసిల్ల కాళేశ్వరం జలాలు ఎక్కడికి, ఎలా వచ్చినాయో నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. కాళేశ్వరం పంపు హౌజ్ లో బాహుబలి మోటార్లు చెడిపోయి పది నెలలు గడుస్తున్నా బాగు చేయలేదని, జిల్లాలో నిర్మిస్తున్న 9వ ప్యాకేజీని పూర్తి చేసి, అప్పరు మానేరును నింపిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. మిడ్ మానేరు నిండినా, ఎల్ఎండీ నిండిన.. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్లనే అనే విషయం కేటీఆర్ గమనించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపి డాక్టర్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్లను పటించుకొనే పరిస్థితి లేదన్నారు. హాస్పిటల్, లైబ్రరీ పక్కనే మీటింగ్ పెట్టీ రోగులను, చదువుకునే విద్యార్థులను శబ్దకాలుష్యంతో ఇబ్బంది పెట్టారన్నారు.
కేటీఆర్ చేసే కంత్రి పనుల, కేసీఆర్ చేసిన అవినీతి, కవిత చేసిన లిక్కర్ దందాల నుండి కాపాడుకోడానికి ఢిల్లీ బీజేపీతో ఎవరు దోస్తీ చేస్తుర్రో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను విమర్శించే నైతిక హక్కు నీకు, కేసీఆర్ కుటుంబానికి లేదని, ఎన్నికల కోడ్ వస్తదని అసంపూర్తిగా ఉన్న కూడ హడావిడిగా మెడికల్ కాలేజీ ఓపెన్ చేశారని, పరీక్ష విధానం పై అవగాహన లేని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి టెట్ పరీక్షను ఆగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు, తంగాళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ, నాయకులు నాలుక సత్యనారాయణ, కాసర్ల రాజు, మునిగల రాజు, కర్రోళ్ల భాస్కర్, అన్నల్ దాస్ భాను, దేవరాజు తదితరులు.