పగలు మానుకొని పనులు చేయండి
పగలు మానుకొని పనులు చేయండి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు.
దిశ, కోరుట్ల : పగలు మానుకొని పనులు చేయండి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయం అంటే హుందాగా చేయాలని, చిల్లర పనులు చేయొద్దని పేర్కొన్నారు. మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఇప్పటి వరకు బోనస్ ఊసే లేదని, రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు లేదని అన్నారు. స్వయాన రైతులే ఈమేరకు పాదయాత్రలో చెప్పారని తెలిపారు.
ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలైన విద్య, వ్యవసాయం గురించి కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. ప్రతిపక్షాల మీద పగలు మానుకొని ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చాలని సూచించారు. పాదయాత్ర అంటే ఎలక్షన్ల ముందే చేయాలన్న రాజకీయం తనకు తెలియదని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రనవేణి సుజాత, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.