భార్యను చంపి.. భర్త ఆత్మహత్య..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ముదం వెంకటేష్ (40) పట్టణ శివారులో ఉన్న తన పొలం వద్దకు భార్య వసంత (36)ను తీసుకెళ్ళి కర్రలతో కొట్టి చంపాడు. తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాలు కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతులకు కొడుకు, కూతురు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.