మాతలకు ఎంత కష్టం.. ఎంసీహెచ్‌లో యాసిడ్ ఎఫెక్ట్ (వీడియో)
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణా కేంద్రంలో బాలింతలు, వారి బంధువులు...Special News
దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణా కేంద్రంలో బాలింతలు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి మాతా శిశు ఆసుపత్రిలోని బాత్రూంలను సిబ్బంది యాసిడ్ తో శుభ్రం చేశారు. అధిక గాఢత ఉన్న యాసిడ్ తో బాత్రూంలు శుభ్రం చేయడంతో వార్డులో ఉన్న బాలింతలు అవస్థలు పడ్డారు. వార్డు మొత్తం కూడా యాసిడ్ స్ప్రే ప్రభావం చూపడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయింది. పవర్ పుల్ యాసిడ్ కావడంతో పొగలు, గాఢతతో ఇబ్బంది పడ్డామని పేషెంట్లు తెలిపారు. చివరకు బంధువుల ఆందోళన చేయడంతో ఆసుపత్రి యంత్రాంగం వేరే రూంకు తరలించారు. వార్డులోని ద్వారాలు, విండోస్ క్లోజ్ చేసి ఉంచడంతో ఇబ్బంది మరీ ఎక్కువ అయిందన్నారు. తలుపులు తెరిచే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారని పేషెంట్ల బంధువులు ఆరోపించారు. ఆందోళన చేయనట్టయితే బాలింతల ఆరోగ్య పరిస్థితి విషమించి పోయేదని వారు వివరించారు.