దిశ అంటేనే ట్రెండ్ సెట్టర్.. ఎస్ఐ రామ్మోహన్...
దిశ అంటేనే పత్రికా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్ అన్నారు.
దిశ, తంగళ్లపల్లి : దిశ అంటేనే పత్రికా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్ అన్నారు. ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దిశ దిన పత్రిక నూతన సంవత్సర - 2025 క్యాలెండర్ లను ఎస్సై రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దిశ శ్రీకారం చుట్టిందని తెలిపారు.
పత్రికా రంగానికి డిజిటల్ ఎడిషన్ కు పరిచయం చేసిన ఘనత దిశ కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల దిశ ప్రతినిధి దుబ్బాక రాజు, డాక్టర్ దేవరాజ్, ఆరెపల్లి బాలు, పొన్నల పరుశురాం, బూరుగుపల్లి అనిల్ కుమార్, అలుగునూరి నరేష్, నేరెళ్ల అనిల్ గౌడ్, వెంగళ రమేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.