మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ పమేల సత్పతి కోరారు.
దిశ, మానకొండూర్ : మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ పమేల సత్పతి కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రభుత్వ ప్రాథమిక అస్పత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, 13 సంవత్సరాలు దాటిన బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా గర్భిణులు సాధారణ ప్రసవం జరిగేటట్లు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, స్థానిక వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.