షమీ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..
చెడు ఎంత ప్రభావవంతమైనప్పటికీ.. మంచే విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
దిశ, గంగాధర : చెడు ఎంత ప్రభావవంతమైనప్పటికీ.. మంచే విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన షమీ పూజలో గ్రామస్తులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడు ఎంత ప్రభావవంతమైనప్పటికీ.. ఎప్పటికీ మంచే విజయం సాధిస్తుందని, అలాగే అడ్డంకులను, కష్టాలను ఎదుర్కునే శక్తి, సామర్థ్యం, ధైర్యం.. ఆ దుర్గామాత ప్రజలందరికీ అందించాలని దుర్గామాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.