శబ్ద కాలుష్య నివారణపై ఉక్కుపాదం

ద్విచక్ర వాహన సైలెన్సర్ లో మార్పులు చేసి, శబ్ద కాలుష్యానికి

Update: 2024-09-07 09:56 GMT

దిశ, కోనరావుపేట : ద్విచక్ర వాహన సైలెన్సర్ లో మార్పులు చేసి, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వ్యక్తి ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కే ద్రంలో శనివారం ద్విచక్ర వాహనం సైలెన్సర్ మాడిఫై చేపించి షార్ట్( శబ్దం) చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి ,వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది అని కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా,ఎక్కువ శబ్దాలు చేస్తూ,సౌండ్ పొల్యూషన్ చేసే వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

మైనర్ బాలురు వాహనాలు నడిపి నట్లయితే తల్లిదండ్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.స్కూల్ /కాలేజ్ /గ్రామ వీధుల్లో ఎటువంటి సంబంధం లేకుండా తిరుగుతున్న,ప్రజలను ఇబ్బంది కల్గించే ఆకతాయిలను ఎవరైనా ఉంటే పోలీస్ Dial 100 కు సమాచారం ఇచ్చినట్లయితే,ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిలపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ జగన్, విశాల్,నరేష్,గంగయ్య, ఇమ్రాన్ ,అన్నారు.


Similar News