నాగాభరణం ధరించిన గణపయ్య.. నిమజ్జన వేళ విశేషం..

పరమశివుడి కంఠాభరణం అయిన నాగుపాము ఆయన

Update: 2024-09-16 12:50 GMT

దిశ, జగిత్యాల : పరమశివుడి కంఠాభరణం అయిన నాగుపాము ఆయన తనయుడు లంబోదరుడి మెడలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చింది. జగిత్యాల పట్టణంలోని త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ధర్మశాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం ముందు 45 అడుగుల భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. అదే మండపంలో పూజలు చేసేందుకు గాను మరో చిన్న గణపతిని ప్రతిష్టించి నిత్యం భక్తిశ్రద్ధలతో గత తొమ్మిది రోజులుగా కొలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పెద్ద నాగుపాము మండపంలో ప్రత్యక్షమైంది. కొద్దిసేపు వినాయకుడి మెడలో ఉండి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయింది. దీంతో గణనాథుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున మండపానికి తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మశాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 135 ఏళ్ల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడి ఆలయ పరిసరాల్లో నిత్యం ఓ నాగుపాము సంచరిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సాక్షాత్తు శివుని అలంకారమైన నాగేంద్రుడే వినాయకుడి దర్శనం చేసుకున్నట్లుగా భక్తులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Similar News