మోత్కరావుపేట - చందుర్తి రోడ్డుకు మోక్షం

చందుర్తి - ఉమ్మడి మేడిపల్లి మండలాల ప్రజల చిరకాల కోరిక చందుర్తి, మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Update: 2024-12-20 10:37 GMT

దిశ, మేడిపల్లి : చందుర్తి - ఉమ్మడి మేడిపల్లి మండలాల ప్రజల చిరకాల కోరిక చందుర్తి, మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ అనుమతులు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ వారు అనుమతులు జారీ చేశారు. చందుర్తి, మోత్కరావుపేట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయితే మేడిపల్లి మండల నుండి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు దూరాభారం తగ్గడంతో పాటు హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లే వారికి సమయం, దూరాభారం తగ్గనుంది.

    కాగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో చందుర్తి, మోత్కరావుపేట రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ అనేక ఆందోళనలు నిర్వహించారు. నేడు ప్రభుత్వ విప్ హోదాలో అడవీశాఖ అనుమతులు మంజూరు కోసం మంత్రులను, అధికారులను కోరారు. నేడు రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ అనుమతులు రావడం పట్ల కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అడవి శాఖ మంత్రికి ప్రభుత్వ విప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనుమతులు రావడం పట్ల చందుర్తి, మేడిపల్లి మండలాల ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. 


Similar News