Ramagundam: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది రామగుండం రోడ్ల పరిస్థితి

పేరు గొప్ప.. అంటే ఇదే మరి. అన్ని వున్న.. అల్లుని నోట్లో శని.. అన్నట్టుగా ఉంది రామగుండం నగరపాలక సంస్థ పరిస్థితి.

Update: 2024-07-27 04:29 GMT

దిశ, గోదావరిఖని : పేరు గొప్ప.. అంటే ఇదే మరి. అన్ని వున్న.. అల్లుని నోట్లో శని.. అన్నట్టుగా ఉంది రామగుండం నగరపాలక సంస్థ పరిస్థితి. 42 వ డివిజన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్‌లో గత కొంతకాలంగా అధ్వానంగా మారిన రోడ్లను చూసి వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని చుట్టూ ప్రక్కల నుంచి వివిధ అవసరాల నిమిత్తం ప్రతిరోజు వేలాది మంది ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీ నగర్‌కు ఇదే కళ్యాణ్ నగర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ గుంతలు పడిన రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పాలకులు గాని, అధికారులు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ఈ కళ్యాణ్ నగర్‌కు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో కళ్యాణ్ నగర్‌ రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి భూమి పూజ చేసినప్పటికీ.. ఎన్నికల అనంతరం పనుల్లో పురోగతి కనిపించడం లేదు. గత పది నెలలుగా రామగుండం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. పాలకులు, అధికారులు నిర్లక్ష్యం నగర ప్రజలకు శాపంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News