కేటీఆర్‌కి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే నైన్త్ ప్యాకేజీ బలి: రేవంత్ రెడ్డి
మంత్రి కేటీఆర్ కి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే నైన్త్ ప్యాకేజీ బలి అయిందని, ఎంఆర్ కేఆర్ సంస్థ... Revanth Reddy hits out at KTR
దిశ, గంభీరావుపేట: మంత్రి కేటీఆర్ కి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే నైన్త్ ప్యాకేజీ బలి అయిందని, ఎంఆర్ కేఆర్ సంస్థ మంత్రి కేటీఆర్ హరీష్ ల జేబు సంస్థ అని, అందుకే పనులు ఆగిపోతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తయితే చుట్టుపక్కల రైతులకు ఎంతో ఉపయోగమవుతుందని, గొలుసు కట్టు చెరువుల నుండి భూగర్భ జలాలు పెరిగుతాయని, 9 ప్యాకేజీ పనులు కేవలం అవినీతి వల్లే పనులు ఆగిపోయాయని అన్నారు. మొదట్లో నైన్త్ ప్యాకేజీ పనులు ఐవీఆర్ సీఎల్ కంపెనీకి ఇచ్చి, వారు పనిచేయడం లేదని, ఆ సంస్థను తొలగించి, కేటీఆర్ సన్నిహితులు కంపెనీకి రీటెండర్ చేసారని ఆరోపించారు. వారు మీద మీద పనిచేసి పైసలు తీసుకొని, మూడు కిలోమీటర్ల కెనాల్ పనులు పెండింగ్ పెట్టారని, మళ్ళీ ఇప్పుడు అంచనాలు పెంచి, దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
పనులు చేయని ఎంఆర్ కేఆర్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుని, ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ లకి ఎంఆర్ కేఆర్ జేబు సంస్థ అని అన్నారు. ఈ ప్రాంత ప్రాజెక్టు పనులను ఈ ప్రాంత కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆంధ్రా కాంట్రాక్టులకు ఇవ్వడంతోనే, ఈ ప్రాంత రైతులపై చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అని అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి మంత్రి అయి, రూ. వేల కోట్లు సంపాదించుకున్న మంత్రి కేటీఆర్, ఈ ప్రాంత రైతుల అవసరాలు తీర్చే నైన్త్ ప్యాకేజ్ పనులను పూర్తి చేయడంలో చిత్తశుద్ధి కనబడత లేదని అన్నారు. ఎంఆర్ కేఆర్ సంస్థ పై విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే నైన్త్ ప్యాకేజీ బలి అయిందని ఆరోపించారు. నైన్త్ ప్యాకేజ్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో, ధరలు పెరిగాయని, రెవెన్యూ చట్టం ప్రకారం ధరలను సంస్థ నుండే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నైన్త్ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హామీద్, ఎంపీటీసీ పర్శరాములు, పాపగారి రాజు, నాయకులు సంగీతం, శ్రీనివాస్, ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు.