ప్రమాదపుటంచున రామడుగు, గుండి వంతెన..?
ఎడతెరిపిలేని కురుస్తున్న భారీ వర్షాలకు రామడుగు, గుండి వంతెనలు ప్రమాద పరిస్థితికి చేరుకున్నాయి. వరద ప్రవాహం దాదాపు బ్రిడ్జి పైకి చేరుకోవడంతో వంతెనను దాటుటకు వాహనదారులు జంకుతున్నారు.
దిశ, రామడుగు: ఎడతెరిపిలేని కురుస్తున్న భారీ వర్షాలకు రామడుగు, గుండి వంతెనలు ప్రమాద పరిస్థితికి చేరుకున్నాయి. వరద ప్రవాహం దాదాపు బ్రిడ్జి పైకి చేరుకోవడంతో వంతెనను దాటుటకు వాహనదారులు జంకుతున్నారు. గతంలోనూ కురిసిన వర్షాలకు రామడుగు మోతే వాగు బ్రిడ్జి పై నుండి నీరు వెళ్లడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇట్టి వంతెన పరిస్థితుల గురించి గతంలో దిశ హెచ్చరించిన అధికారులు, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మోతే వాగు పై నిర్మించిన నూతన వంతెన పనులు దాదాపుగా చివరి స్టేజికి చేరుకున్నప్పటికీని ఇరువైపులా భూసేకరణ చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఇదిలా ఉండగా గుండి గ్రామంలో గల వంతెన భారీ వాహనాలకు వంతెన కింది భాగంలో ఇనుప కడ్డీలు పూర్తిగా తేలడంతో వంతెనను ఆనుకొని వరద ప్రవాహం వెలుతుండడంతో వంతెన కూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గతంలో జరిగిన అనుభవం ఇప్పుడు పునరావృతం కావడంతో స్థానికులు అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందిస్తారో.. లేరో.. వేచి చూడాలి మరి.
Read More: Jammikunta : జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు.. భారీగా ఆస్తి నష్టం