మార్కెట్ యార్డ్ తరలింపుకు చర్యలు..: కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా

Update: 2024-11-19 13:56 GMT

దిశ,మంథని : మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో మంథని మున్సిపాలిటీ పై అదనపు కలెక్టర్ అరుణా శ్రీ తో కలిసి రివ్యూ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. మంథని పట్టణంలో మార్కెట్ యార్డు ఉన్నచోట సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని దీని కోసం మార్కెట్ యార్డ్ ను తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు.

మంథని పట్టణంలో ఉన్న మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య విధులను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.మంథని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన పారిశుద్ధ్య వాహనాల ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రోడ్డు శుభ్రంగా ఉండేలా చూడాలని,వీధి దీపాల పనితీరు నిరంతరం పరిశీలించాలని,పారిశుద్ధ్య సిబ్బంది అటెండెన్స్ పర్యవేక్షించాలని అన్నారు.ఈ సమావేశంలో ఈఈపిఆర్.గిరీష్ బాబు, జడ్పీ సీఈవో నరేందర్ , మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.


Similar News