protest : రహదారిపై నాట్లు వేసి నిరసన
రహదారి పై వరి నాట్లు వేసి బీఆర్ఎస్ మహిళా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
దిశ, సుల్తానాబాద్ : రహదారి పై వరి నాట్లు వేసి బీఆర్ఎస్ మహిళా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో, బుడద మయమై గుంతలు పడ్డ రోడ్డుపై నడవడానికి ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు. వార్డ్ కౌన్సిలర్ చింతల సునీత రాజు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ 8 వార్డ్ మహిళలు రోడ్డుపై నాటు వేసి నిరసన తెలిపారు. వానలకు రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు
నిలవడంతో పలువురు మహిళలు వరి నాట్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిప్పారపు కమల-దయాకర్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రోడ్ల స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మున్సిపల్ అధికారులు, పరిగణలోకి తీసుకొని వార్డ్ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.