చాకలి ఐలమ్మ విగ్రహానికి రాజకీయ రంగు..

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు,

Update: 2024-09-12 11:19 GMT

దిశ, గోదావరిఖని టౌన్: తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు, ప్రారంభోత్సవానికి రాజకీయ రంగు అడ్డు వచ్చింది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చాకలి ఐలమ్మ వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఒక వర్గం నాయకత్వంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, నిర్మాణాన్ని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గోదావరిఖని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగానే మరో మార్గం వారు రాజకీయ ఒత్తిడితో రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.

ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ముందు తరాల వారికి చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమను, గొప్పతనాన్ని వివరించుటకు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వాలు మారడంతో మరో వర్గం వారు ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా చాకలి ఐలమ్మ వారసులు అందరూ కలిసి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని తెలంగాణ పోరాట యోధులు కోరుతున్నారు.


Similar News