Sp :నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణే కీలకం

నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణే కీలకం అని, ఫిర్యాదు మొదలుకొని చార్జిషీట్ వరకు కేసులో ప్రతి విషయాన్ని కూలంకుషంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (District SP Akhil Mahajan)సూచించారు.

Update: 2024-10-27 14:32 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల : నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణే కీలకం అని, ఫిర్యాదు మొదలుకొని చార్జిషీట్ వరకు కేసులో ప్రతి విషయాన్ని కూలంకుషంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (District SP Akhil Mahajan)సూచించారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ స్టేషన్ రైటర్లకు క్రైమ్ కేసుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

     నేరస్తుల సాక్ష్యాధారాలు (Evidence)ఏ విధంగా సేకరించాలి, శవ పంచనామా ఎలా చేయాలి, నేర స్థలంలో ఏ వస్తువులు స్వాధీనం చేసుకోవాలి, నేర స్థలంలో ఏఏ విషయాలు గమనించాలి, సాక్షుల వాంగ్మూలం ఏ విధంగా నమోదు చేయాలి, ఫోరెన్సిక్ లేబోరేటరీకి ఏం పంపించాలి అనే అంశాలపై శిక్షణ ఇప్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సాక్ష్యాల వల్ల నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే విధంగా చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, పీసీఆర్ సీఐ మధుకర్, డీసీఆర్బీ ఎస్ఐ జ్యోతి, పోలీస్ స్టేషన్ల రైటర్స్ పాల్గొన్నారు.

Tags:    

Similar News