కన్నవాళ్ళు ఉన్న ..కడచూపుకు రాని వైనం..

నవ సమాజ నిర్మాణంలో మానవత్వం మంట కలిసి పోతుంది

Update: 2024-11-25 09:06 GMT

దిశ,రామడుగు : నవ సమాజ నిర్మాణంలో మానవత్వం మంట కలిసి పోతుంది అనడానికి ఈ సంఘటన ఉదాహరణగా చూపవచ్చు. నవమాసాలు మోసి కన్న పేగు తెంచుకొని నలుగురు నీ కన్నా చివరి చూపుకైనా చిదిమంటల కోసం ఎదురుచూసిన కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు కొడుకు రాకపోవడంతో తుదికి అనాధాశ్రమంలో తుది శ్వాస విడవడంతో చేసేదేమీ లేక ఆ నిర్వాహకుడే తన ఆశ్రమంలో దహన సంస్కారాలు చేసిన పరిస్థితి రామడుగు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దుర్గమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవనం గడుపుతుంది.

కానీ తనకు ముగ్గురు కూతుర్లతో పాటు ఓ కొడుకు ఉన్నారు. కూతుళ్ళతో పాటు కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ వృద్ధాప్యం మీద పడ్డ తర్వాత కన్న కొడుకు వదిలేయడం తో తన చేవను నమ్ముకొని కూలినాలి చేస్తూ ఇన్నాళ్లు బ్రతికింది. కాగా ముగ్గురు కూతుళ్లు ముచ్చటగా పెళ్లి చేసి పంపించినప్పటికీ ఏ కూతురు కూడా తన తల్లిపై మమకారం చూపకుండా కఠినంగా వ్యవహరించారు. చేసేదేమీ లేక తన సత్తువను కూడగట్టుకొని ఇన్నాళ్లు గడుపుకుంటూ వచ్చింది. ఇక తన వృద్ధాప్యం మీద పడడంతో తిండి లేని పరిస్థితి ఎదుర్కోవడంతో గత నెల క్రితం ఆ తల్లి చేసేదేమీ లేక రామడుగు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. అయినప్పటికిని ఏ కూతురు కొడుకు పట్టించుకోకుండా మాకు ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులు అదే గ్రామానికి చెందిన మంచికట్ల శ్రీనివాస్ నిర్వహిస్తున్న స్పందన అనాధ ఆశ్రమంలో చేర్పించారు.

ఇక ఆ ఆశ్రమాన్ని నమ్ముకుని తన జీవనాన్ని గడుపుకుంటున్న తరుణంలో ఆరోగ్యరీత్యా తను పూర్తిగా క్షీణించి పోవడంతో ఆశ్రమ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులకు తెలియపరచినప్పటికిని ఏ ఒక్క కూతురు కొడుకు దరిచేరకపోవడం తానే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం తన ఆశ్రమానికి తెచ్చుకున్న రెండు మూడు రోజుల్లోనే తను ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఈమవిషయం తన కూతుళ్లకు కొడుకు తెలియజేసినప్పటికీ ఆఖరి చూపు కైనా వచ్చి తన తల్లిని దహన సంస్కారాలు చేయమని కోరినప్పటికిని వారు కఠినత్వం వ్యవహరించి మానవత్వాన్ని మరిచి మాకు ఆ తల్లికి ఎలాంటి సంబంధం లేనట్లు వ్యవహరించడంతో చేసేదేమీ లేక స్పందన అనాధాశ్రమం నిర్వాహకులైన మంచికట్ల శ్రీనివాస్ స్వయంగా ఆ తల్లికి పెద్ద కొడుకులా చితిమంటలు పెట్టి దహన సంస్కారాలు చేశారు.


Similar News