ఒకే మూత్రశాల..139 మంది విద్యార్థులు..

జగిత్యాల రూరల్ మండలంలోని జాబితా పూర్ గ్రామంలో ఉన్న

Update: 2024-09-25 09:04 GMT

దిశ,జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని జాబితా పూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77,ప్రాథమిక పాఠశాలలో 62 ఉండగా,మొత్తానికి 139 మంది విద్యార్థులు చదువుతున్నారు.ఇందులో 66 మంది బాలికలు ఉన్నారు. కానీ అందరికీ కలిసి ఒకే మూత్రశాల ఉండటం,అందులోకి వెళ్ళడానికి క్యూ కట్టే దయనీయ పరిస్థితి నెలకొంది.దీనిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. గతంలో రెండు మూత్రశాల కు బేస్ మెట్ కట్టగా అధికారులు నిధులు ఆపడటం తో పనులు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూత్రశాలకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను…: జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్

పాఠశాలలో ఒకే మూత్రశాల ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని ఉన్నత అధికారులకు తెలిపాము. గత వేసవి కాలంలో అమ్మ కమిటీ ఆధ్వర్యంలో రెండు మూత్రశాల నిర్మాణం కు బేస్ మెట్ వరకు కట్టిన నిధులు రద్దు కావడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి,మళ్ళీ అధికారులకు సమాచారం అందించాను.


Similar News