పంచాయతీ కార్యదర్శి పై దాడి...
గ్రామపంచాయతీ కార్యదర్శి పై ఉపసర్పంచ్, ఆమె భర్త దాడి చేసిన సంఘటన గంభీరావుపేట మండలం జగదంబ తండాలో చోటు చేసుకుంది.
దిశ, గంభీరావుపేట : గ్రామపంచాయతీ కార్యదర్శి పై ఉపసర్పంచ్, ఆమె భర్త దాడి చేసిన సంఘటన గంభీరావుపేట మండలం జగదంబ తండాలో చోటు చేసుకుంది. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం జగదాంబ తండాలో ప్రజల సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ఎజెండా అంశాలు చర్చిస్తున్న సమయంలో ఉపసర్పంచ్ బుక్య ప్రమీల గ్రామసభకు వచ్చి సర్పంచి చెప్తే పనిచేస్తున్నావని, అకారణంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.
షర్టు పట్టుకొని కుడిచేతి పై కొడుతూ గ్రామసభ నుండి నెట్టివేసిందని తెలిపారు. అంతే కాకుండా ఆమె భర్త భుఖ్యా మోహన్ గ్రామంలోకి రానీయ్యను.. చంపుతామంటూ బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని అన్నారు. గ్రామఉపసర్పంచ్, ఆమె భర్త పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.