ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం... గాయంలోని రాళ్లు తీయకుండానే కుట్లు

హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.... negligence

Update: 2023-03-05 06:51 GMT

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం హుజూరాబాద్ కు వచ్చి తిరిగి శనివారం రాత్రి బంధువుతో మోటార్ సైకిల్ పై వెళుతున్న భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కు చెందిన ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మోకాలుకి తీవ్ర గాయం కావడంతో చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. కాగా ఎక్స్ రే తీయకుండానే గాయం వద్ద శుభ్రం చేసిన వైద్యులు ప్రేమలత మోకాలుకి కుట్లు వేశారు. అనంతరం ఎక్స్ రే తీయగా మోకాలులో రాళ్లు ఉన్నాయని గుర్తించిన ఆమె బంధువులు వైద్యుల దృష్టికి తీసుకువెళ్లారు. గాయమైన మోకాలును క్లీన్ చేసిన డాక్టర్ తిరిగి మళ్లీ కుట్లు వేసి వదిలేశారు. అనంతరం మరోసారి ఎక్స్ రే తీయగా గాయమైన మోకాలులో రాళ్లు అలాగే ఉన్నాయని తేలిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ విషయం మళ్లీ వైద్యులకు విన్నవించగా తామేమీ చేయలేమని వరంగల్ లోని ఎంజీఎంకు తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకుంటే రాళ్లు తొలగిస్తారని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితురాలు బంధువులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.



Tags:    

Similar News