సత్వర సమాచారం అందించడంలో దిశ అగ్రగామి..
సమాజంలో జరిగిన వార్తలను డిజిటల్, ప్రింటింగ్ రూపంలో సత్వరమే ప్రజల ముందు ఉంచడంలో దిశ అగ్రగామిగా నిలుస్తుందని తహశీల్దార్ అన్నారు.
దిశ, బీర్ పూర్ : సమాజంలో జరిగిన వార్తలను డిజిటల్, ప్రింటింగ్ రూపంలో సత్వరమే ప్రజల ముందు ఉంచడంలో దిశ అగ్రగామిగా నిలుస్తుందని తహశీల్దార్ అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దిశ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో దిశ ముందు ఉంటుందని, రానున్న కాలంలో దిశ మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ముంతాజుద్దీన్, డిటీ శ్రీనివాస్ ఆర్ఐలు శ్రీనివాస్, రాహుల్, కార్యాలయ సిబ్బంది, పాత్రికేయులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.