అనతి కాలంలో ప్రజల మనస్సు దోచుకున్న ‘దిశ’
అనతి కాలంలోనే దిశ పత్రిక ప్రజల మనస్సులో నిలిచిపోయిందని, డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళ్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ,పెద్దపల్లి : అనతి కాలంలోనే దిశ పత్రిక ప్రజల మనస్సులో నిలిచిపోయిందని, డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళ్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల కలెక్టర్ జె. అరుణ శ్రీల చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా ‘దిశ’ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ప్రజల సమస్యలను అధికారులకు వార్తల రూపంలో వెంటనే చేరవేస్తుందని తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పని చేస్తుందని గుర్తు చేశారు. ఎలాంటి వార్తనైనా నిమిషంలోనే డిజిటల్ మీడియా ద్వారా అందరికీ చేరవేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట సతీష్, లింగన్న, మాదరబోయిన కిషన్, వెంకటేష్, వీరస్వామి, శేఖర్, రమేష్, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.