స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, సర్పంచ్ లు, ఎంపీటీసీలు మన వాళ్లనే గేలిపించాలని కార్యకర్తలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.

Update: 2025-01-02 10:14 GMT

దిశ,సైదాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, సర్పంచ్ లు, ఎంపీటీసీలు మన వాళ్లనే గేలిపించాలని కార్యకర్తలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ 2025 సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని, హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి పని చేయాలన్నారు. నియోజకవర్గంలో విద్యా ,వైద్యం, సాగునీరు అందించడం నా తొలి ప్రాధాన్యత అన్నారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదే అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామగ్రామాన ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలని కోరారు.

    ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , 500కి గ్యాస్ అందిస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సన్న వడ్లకి 500 బోనస్ ఇచ్చామని, వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసామన్నారు. పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

    ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు ,ఓపెన్ జిమ్ ల నిర్మాణం జరుగుతుందని, ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ , బీఆర్​ఎస్​లను ధీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలను కోరారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆరా తీసి పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, యాదగిరి, రాజు, మల్లయ్య, రవీందర్ ఉన్నారు. 


Similar News