సీఎం పర్యటనపై ఎమ్మెల్యే సమీక్ష
కొండగట్టుకు ఈనెల 14వ తేదీన సీఎం పర్యటన ఖరారైన సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భద్రత పర్యవేక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ,ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాష్ తో చర్చించారు.
దిశ, మల్యాల : కొండగట్టుకు ఈనెల 14వ తేదీన సీఎం పర్యటన ఖరారైన సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భద్రత పర్యవేక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ,ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాష్ తో చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం అభివృద్ధి చెందిందని, ప్రతి ఆలయం పై దృష్టి సారిస్తూ యాదాద్రి తరహాలో కొండగట్టును అభివృద్ధి పరచడానికి రూ.100 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
జైశ్రీరామ్ అనే నినాదం బీజేపీ సొంతం కాదు అని, రాముడు పుట్టిన నాటి నుంచి హిందువులు, ముస్లింలు కూడా రామునికి పూజ చేస్తూ జైశ్రీరామ్ అనే నినాదాన్ని నినదిస్తున్నారని, కొండగట్టుకు 100 కోట్లు కేటాయించడం పై బయట వస్తున్న పుకార్లను తిప్పికొట్టారు. ఓట్ల కోసమో నోట్ల కోసమో కేటాయించలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కి దైవభక్తి ఎక్కువే అని అన్నారు. అందుకే దేశం కూడా ఇలాంటి నాయకుడు కావాలని కోరుకుంటుందని తెలిపారు.