'దళితబంధు'లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి : MLA Eatala Rajender
దళితబంధు మంజూరు కోసం డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
దిశ, హుజూరాబాద్: దళితబంధు మంజూరు కోసం డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అయన విలేకరులతో మాట్లాడారు. దళితబంధు పథకంలో డబ్బు ఇప్పించేందుకు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల లంచం తీసుకున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అన్నారు. సదరు ఎమ్మెల్యేలు బాధితులకు ఆ డబ్బును వాపస్ ఇవ్వాలన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో రూ.2లక్షల కోట్లతో దళితబంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసి హామీ నిలబెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా మూడు వేల కుటుంబాలకు ఈ పథకం అందలేదని, మొదటి విడత ఎంపికైన వారందరికీ తక్షణమే రెండో విడత డబ్బు చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు.
Also Read..
తెలంగాణలో ప్రతి ప్రభుత్వ స్కీమ్‌లో స్కామే: MLA రఘునందన్ రావు ఫైర్
వేసవిలో బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకూడదంటే.. నీటిలో వీటిని కలుపుకుని తాగాల్సిందే?