'దళితబంధు'లో ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
'దళితబంధు' పథకంపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
దిశ, హుజూరాబాద్: 'దళితబంధు' పథకంపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధు యూనిట్ల మంజూరు కోసం ఎమ్మెల్యేలు డబ్బు తీసుకున్నట్లు సీఎం మాట్లాడినపుడు విన్నావా ఈటల అంటూ... అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయన్నారు.
దళితబంధు రాని వారు ఎవరైనా ఉంటే స్వయంగా తనకు ధరఖాస్తు చేసుకోవాలని, ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17,600 దళితబంధు యూనిట్లు మంజూరైనట్లు ఈటల చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, సింగిల్ విండో చైర్మెన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, గందె శ్రీనివాస్ పాల్గొన్నారు.