వరండాలో వైద్యం.. మండలం మొత్తానికి మూడే బెడ్లు

Update: 2024-08-21 12:02 GMT

దిశ; శంకరపట్నంః శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఓ జ్వర బాధితురాలికి వరండాలోనే వైద్యం అందించారు. వివరాల్లోకి వెళితే తాడికల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగ ఆస్పత్రిలో పడకలు అప్పటికే నిండిపోవడంతో వరండాలో ఉన్న ఓ బెంచీ పై పడుకోబెట్టి సెలైన్ పెట్టారు. వాస్తవంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు పీడియాట్రిక్ బెడ్స్, మూడు సాధారణ బెడ్స్ ఉన్నట్లు వైద్యుడు గొట్టే శ్రవణ్ కుమార్ తెలిపారు. కానీ సీజనల్ వ్యాధులతో ఆరోగ్య కేంద్రానికి జనం పోటెత్తుతున్నారని పరిస్థితులను బట్టి వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి అవుట్ పేషెంట్ విభాగానికి జ్వర బాధితులు పెద్ద మొత్తంలో తరలివస్తున్నారు. ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను పెంచాలని పలువురు పేషెంట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News