కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితి..
కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో సిరిసిల్ల, తంగళ్ళపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, తంగళ్లపల్లి : కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో సిరిసిల్ల, తంగళ్ళపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి పై ఒకరు సవాలు చేసుకుని సిరిసిల్లకు చేరుకుంటున్న క్రమంలో ఇరువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంగళ్లపల్లి మండలం జిలెల్లకు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో, పొన్నం ప్రభాకర్ వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ను పట్టణ సీఐ కృష్ణ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ మాట్ల మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరిసిల్ల తంగళ్ళపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.