పీఎం కిసాన్ లింక్‌తో వాట్సాప్‌లో కేటుగాళ్ల ఘరానా మోసం
ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
దిశ, గంగాధర: ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. విలువైన బహుమతులు, ఈ కేవైసీ, క్రెడిట్ కార్డులతో పాటు వాట్సాప్‌లకు లింకులు పంపించి బురిడీ కొట్టుస్తున్నారు. తాజాగా..జిల్లా లోని గంగాధర గ్రామానికి చెందిన శ్రీకాంత్ కు వాట్సాప్‌కు తన బంధువు నుండి పీఎం కిసాన్ కు సంబంధించిన లింకు రాగ ఆ లింకును క్లిక్ చేయగా శ్రీకాంత్ కు సంబంధించిన క్రెడిట్ కార్డు నుంచి రూ. 39 వేలు కట్ అయినట్టు సమాచారం వచ్చింది.
ఆ మెసేజ్ ని చూసి మోసపోయిన అని గ్రహించి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పంపిన వారి బంధువులకు సమాచారం ఇవ్వగా నా వాట్సాప్ అకౌంట్ ఎవరు హ్యాక్ చేశారని నేను ఆ మెసేజ్ పంపలేదని అంతేకాక అతని వాట్సాప్ నుండి చాలామందికి మెసేజ్ వెళ్లే అని అతను తెలిపాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి ముందుగా తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించాడు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనల వాట్సాప్ లో వచ్చిన లింక్ చూసి చాలామంది మోసపోయి ఉంటారని తనలా ఎవరు మోసపోవద్దు అన్నారు.