రూపురేఖలు మారనున్న మంథని మున్సిపాలిటీ..
మంథని మున్సిపాలిటీకి రూ.24.05 కోట్ల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
దిశ, మంథని : మంథని మున్సిపాలిటీకి రూ.24.05 కోట్ల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దీంట్లో 6.71 కోట్లతో ఐమస్ లైట్స్ సోలార్ పనులు, 8.14 కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డ్ లో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు 9.20 కోట్లతో మంథని మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డీఆర్సీసి కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జి, ఆర్చీల నిర్మాణలకు వేరువేరుగా మంత్రి శంకుస్థాపనలు చేశారు.
దీంతో అభివృద్ధిలో మంథని మున్సిపాలిటీ పరుగులు పెట్టనుంది. దీంతో మంథని మున్సిపాలిటీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ,మంథని ఆర్డీఓ కె.సురేష్, మంథని ఎమ్మార్వో రాజయ్య, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ దేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.