టేకు దుంగల అక్రమ రవాణ.. పట్టించుకోని అధికారులు
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెట్లను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు కలప అక్రమార్కులు మండలంలో చెట్లను నరుకుతూ జోరుగా కలపను అక్రమ రవాణ సాగిస్తున్నారు.
దిశ, చందుర్తి: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెట్లను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు కలప అక్రమార్కులు మండలంలో చెట్లను నరుకుతూ జోరుగా కలపను అక్రమ రవాణ సాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండల పరిధి తిమ్మాపూర్, నర్సింగాపూర్, రామన్నపేట, చందుర్తి, లింగంపేట, మూడపల్లి పలు గ్రామాలలో కలప అక్రమార్కులు రాత్రికి రాత్రే టేకు దుంగలను నరికి పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా అటవి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొని కలప అక్రమ రవాణను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.