పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కైలాసం ఆటలో పాము మింగినంతా పనైతది : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, మళ్ళీ ఆశీర్వదించి

Update: 2023-10-06 14:54 GMT

దిశ,ఇల్లంతకుంట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, మళ్ళీ ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, పొరపాటున కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి వాళ్లకు ఓట్లేస్తే అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ను కైలాసం ఆటలో పాము మింగినంతా పనైతధాని అచితూచి ఆలోచించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రసమయి తో కలిసి 50 పడకల ఆసుపత్రి కి భూమిపూజా, మార్కెట్ కమిటీ భవనం, విఓ భవనం, పల్లె దవాఖాన లను ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు కోతలతో సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతే ఆత్మహత్యలు చేసుకున్నారని, అదే కేసీఆర్ పాలనలో రైతులు పంటలు పుష్కలంగా పండటంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.

ఎన్నికలు వస్తేనే ఓట్ల కోసం వచ్చే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవిస్తే ఆడబిడ్డ పుడితే 13వేలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. మరోమారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను భారీ మెజార్టీతో గెలిపించి ఇల్లంతకుంట మండలాన్ని మరింత అభివృద్ధి చెందేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణ రావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్, మాజీ చైర్మన్ చింతపల్లి వేణు రావు, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News