Huzurabad: జోరుగా బెల్ట్ దందా.. సిండికేట్‌గా మారిన మద్యంవ్యాపారులు

హుజూరాబాద్‌లో ఎక్సైజ్ అధికారుల కనుసన్ననలో మద్యం సిండికేట్ నడుస్తుంది.

Update: 2024-12-17 01:46 GMT

హుజూరాబాద్‌లో ఎక్సైజ్ అధికారుల కనుసన్ననలో మద్యం సిండికేట్ నడుస్తుంది. మద్యం వ్యాపారులు ఒక్కో బాటిల్ పై రూ.30 అదనంగా వడ్డిస్తూ రూ.లక్షల్లో అక్రమ సంపాదన గడిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. హుజూరాబాద్‌లో మద్యం వ్యాపారులు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తూ ఒక్కో క్వార్టర్‌, ఒక్కో బీర్‌కు అదనంగా వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు మౌనం వహించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్‌లో మొత్తం 9 వైన్ షాపులు, మూడు బార్లు ఉన్నాయి. వైన్ షాపుల్లో కొన్నింటికి పర్మిట్ రూంల పేరుతో లైసెన్స్‌లు తీసుకొని మద్యం వ్యాపారులు నడుపుకుంటున్నారు. వీరు నిబంధనల ప్రకారం కేవలం 100చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలాంటి తినుబండారాలు, సిట్టింగ్ లేకుండా నడుపుకోవాలి. కానీ ఇక్కడ విచ్చలవిడిగా హోటళ్ల మాదిరిగా తినుబండారాలు, సిట్టింగ్‌లు నిర్వహింస్తున్నారు. వారిపై ఎటువంటి అజమాయిషీ లేకపోవడంతో నిర్భయంగా నడుపుకోవచ్చు ప్రజలను దోచుకోవచ్చు అనే విధంగా పర్మిట్ రూంలు కొనసాగుతున్నాయి.

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో ఎక్సైజ్ అధికారుల కనుసన్ననలో మద్యం సిండికేట్ నడుస్తుంది. మద్యం వ్యాపారులు ఒక్కో బాటిల్ పై రూ.30 అదనంగా వడ్డిస్తూ రూ.లక్షల్లో అక్రమ సంపాదన గడిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. హుజూరాబాద్‌లో మద్యం వ్యాపారులు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తూ ఒక్కో క్వార్టర్‌కు, ఒక్కో బీర్‌కు అదనంగా వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు మౌనం వహించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్‌లో మొత్తం 9 వైన్ షాపులు, మూడు బార్లు ఉన్నాయి. వైన్ షాపుల్లో కొన్నింటికి పర్మిట్ రూంల పేరుతో లైసెన్స్‌లు తీసుకొని మద్యం వ్యాపారులు నడుపుకుంటున్నారు. వీరు నిబంధనల ప్రకారం కేవలం 100చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలాంటి తినుబండారాలు, సిట్టింగ్ లేకుండా నడుపుకోవాలి. కానీ ఇక్కడ విచ్చలవిడిగా హోటళ్ల మాదిరిగా బ్రాందీ షాపులోనే తినుబండారాలు, సిట్టింగ్‌లు నిర్వహింస్తున్నారు. వారిపై ఎటువంటి అజమాయిషీ లేదు. నిర్భయంగా నడుపుకోవచ్చు ప్రజలను దోచుకోవచ్చు అనే విధంగా హుజురాబాద్ పర్మిట్ రూంలు కొనాసగుతున్నాయి.

సిండికేట్‌గా మారి దోపిడీ..

హుజూరాబాద్‌లో మొత్తం షాపులు సిండికేట్‌గా మారి మద్యంప్రియుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఒక్కో బాటిల్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు పెంచి బెల్ట్ షాపుల పేరుతో దోచుకుంటున్నారు. హుజూరాబాద్ మండలంలో లెక్క ప్రకారం 1000వరకు బెల్ట్ షాప్‌లు ఉన్నాయి. అనధికారికంగా ఇంకా లెక్కలేదు. వీరు రోజుకు కనీసం ఒక్కో షాపులో రూ.5వేల సరుకు అమ్మినా 1000 షాపులకు గాను అదనంగా రూ.1.50 లక్షలు చొప్పున నెలకు రూ.45లక్షల ఆదాయం వస్తుంది. సిండికేట్ అని రూ.30 కదా అని తేలికగా తీసి పారేసే వారికి ఈ లెక్క చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. రూ.45లక్షల్లో అధికారుల మామూళ్లు, ఇతరత్రా ఖర్చులు, వీరిని కాపాడుతున్న వారి ఖర్చులు, సిబ్బంది ఖర్చులు మొత్తం పోగా ఇంకా మిగులుతాయి. దీంతో వీరికి వైన్ షాపుల్లో వచ్చే ఆదాయం మిగులుతుంది. ఇలా వీరు ఏటా రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. దీంతో మళ్లీ మద్యం వ్యాపారంపై మక్కువ పెంచుకుని ఎక్కువ అయినా టెండర్లు వేస్తున్నారు.

ప్రైవేట్ సైన్యంతో ఆగడాలు..

మద్యం వ్యాపారులు హుజూరాబాద్‌లో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. వీరు వారి ఆమోద పత్రం లేని బెల్ట్ షాపులో అమ్మితే తాట తీస్తారు. మద్యం బాటిళ్లు తీసుకెళ్లి మరోసారి బెల్ట్ షాపు వారికి మందు ఇవ్వరు. వీరు మందు కావాలని వెళ్తే.. వారికి ఫెనాల్టీ వేసి అంతకు ముందు పెట్టిన డిపాజిట్ రద్దు చేసి మందు ఇస్తారు. లేక పోతే లేదు. ఇలా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

Tags:    

Similar News