కాగజ్‌నగర్‌లో ఘనంగా హోలీ వేడుకలు

ప్రజలందరి జీవితాల్లో హోలీ సంబరాలు వెలుగులు నింపాలని సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు... Holi Celebrations in KhagaZnagar

Update: 2023-03-07 10:24 GMT
కాగజ్‌నగర్‌లో ఘనంగా హోలీ వేడుకలు
  • whatsapp icon

దిశ, కాగజ్ నగర్: ప్రజలందరి జీవితాల్లో హోలీ సంబరాలు వెలుగులు నింపాలని సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం సిర్పూర్ నియోజకవర్గం, కాగజ్ నగర్ పట్టణంలో హోలీ సంబరాలను కుల మత భేదాలు లేకుండా ఘనంగా జరుపుకున్నారు. కోనప్ప నివాసం వద్ద నియోజకవర్గంలోని సంఘాల నాయకులు పట్టణంలోని నాయకులు కలిసి కూనప్పకు హోలీ వేడుకల్లో భాగంగా రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ జీవితాల్లో హోలీ వేడుకలు వెలుగులను నింపాలని కోరుకున్నారు. వర్గం ప్రజలందరూ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.


ఎస్ పి ఎం గేట్ గ్రౌండ్లో మహిళలు రంగులను పూసుకుని నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యువకులు, చిన్నారులు పెద్ద ఎత్తున హోలీ వేడుకలను నిర్వహించారు. పట్టణంలో వాడవాడనా హోలీ సంబరాలలో మునిగిపోయారు. బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకుని హోలీ వేడుకలను నిర్వహించారు. కొమురం భీం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, సిర్పూర్ బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు ప్రజలకు హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ హోలీ స్నేహానికి ప్రతీక అని కొనియాడారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. వేడుకల్లో పట్టణ ఆయా పార్టీ నాయకులు, యువకులు చిన్నారులు, మహిళలు, పాల్గొన్నారు.

Tags:    

Similar News