జగిత్యాల జర్నలిస్టుల అర్ధనగ్న ప్రదర్శన.. ఇండ్ల స్థలాల కోసం డిమాండ్

Update: 2024-08-13 07:36 GMT

దిశ, జగిత్యాల టౌన్ : ఇండ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు వినూత్నంగానిరసన చేపట్టారు. వారు నిరసన చేపట్టి నేటికి పదకొండు రోజులు అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నిరసన కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మెడలో ప్లకార్డులు వేసుకొని అర్ధ నగ్నంగా జగిత్యాల పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఇండ్ల స్థలాలు కేటాయించాలని నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము ఎవరికీ వ్యతిరేకం కాదని రాజ్యాంగ బద్ధంగా తమకు రావాల్సిన హక్కుల కోసమే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి ఇండ్ల స్థలాల హామీ నెరవేర్చే వరకు నిరసన దీక్షలకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని తమ న్యాయమైన హామీ నెరవేర్చకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు.

Tags:    

Similar News