జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Update: 2023-08-15 09:40 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం పీల్చుతున్న స్వేచ్ఛ వాయువులని, వారి త్యాగాలను కొనియాడారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News