సమయపాలన పాటించని ప్రభుత్వ అధికారులు.. దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు
అధికారులు సమయానికి విధులకు రావాల్సి ఉన్నప్పటికీ
దిశ,చందుర్తి : అధికారులు సమయానికి విధులకు రావాల్సి ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా హాజరవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారులకు సమయానికి రావలసింది పోయి మాదే ఆఫీస్ మా ఇష్టం వచ్చిన సమయానికి మేము వెళ్తాం మమ్మల్ని ఎవరేం చేయలేరు అని ఉదయం 11 అవుతున్న ప్రభుత్వ కార్యాలయానికి ఉద్యోగులు రాని సంఘటన శుక్రవారం ఉదయం చందుర్తి మండల కేంద్రంలోని చోటు చేసుకుంది, ఉదయం 11గంటలు అవుతున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.
మండలం లో ఏ పని జరగాలన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి, మండల రెవెన్యూ కార్యాలయానికి ప్రజలు వెళ్తుంటారు. కానీ అందులో ఉన్న ఉద్యోగులు 11 అవుతున్న కార్యాలయానికి రాకపోవడంతో వచ్చిన ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. 11 అవుతున్న కాలి కుర్చీలు దర్శనం ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలన తో పాటు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తారు.
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయానికి రావచ్చన్న ధీమాతో ఉద్యోగులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదయం 11 గంటల సమయం అవుతున్న మండల రెవెన్యూ కార్యాలయం, ప్రజా పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయంటే ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కాలి కుర్చీలను చూస్తే అర్థం అర్థమవుతుంది . ఇప్పటికైనా సమయపాలన పాటించని ఉద్యోగులను గుర్తించి సస్పెండ్ చేయాలని కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఉన్నత అధికారులను కోరుకుంటున్నారు.